తెలంగాణ అక్షరం,వీణవంక
గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని కోతిరెడ్డిపల్లిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జన స్వామి అనే గీత కార్మికుడు వృత్తిలో భాగంగా తాటి చెట్లు ఎక్కి ఇంటికి తిరిగి వెళుతున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం అతనిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం బాధితుడిని జమ్మికుంట లోని ఆసుపత్రికి తరలించారు.
Please follow and like us: