ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి ఇల్లందకుంటలో నూతన గ్రామపంచాయతీ ప్రారంభం
తెలంగాణఅక్షరం-ఇల్లందకుంట
ఇల్లందకుంట మండల కేంద్రంలోని నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని 20 లక్షలు నిధులతో కూడిన భవనాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు, అలాగే బీరన్న గుడి కమిటీ హాల్ 15 లక్షలు నిర్మాణం కోసం కురుమ సంఘ కులస్తులతో కలిసి భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టారు, ఈ కార్యక్రమంలో ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్, సర్పంచ్ శ్రీలత సురేందర్ రెడ్డి ఎంపిటిసి ఫోరం అధ్యక్షుడు మోటపోతుల ఐలయ్య, దంసాని విజయకుమార్, దంసాని తిరుపతి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ కందాల కొమురెల్లి, పుట్ట రాజు, టి మొగిలి, తెడ్ల ఓదెలు,దరుగుల రాకేష్, పలువురు సర్పంచులు ఎంపిటిసిలు పాల్గొన్నారు