ఐటీ మినిస్టర్ పర్యటన వేళ ఆంక్షలు..

  • శుక్రవారం ట్రై సిటి పరిధిలో ట్రాఫిక్ మళ్లింపు

  • వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ .వి.రంగనాథ్

తెలంగాణ అక్షరం-వరంగల్ క్రైం

అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఐటీ మంత్రి కేటీఆర్ వరంగల్, హన్మకొండ, కాజీపేట పర్యటనలకు శుక్రవారం రానున్న సందర్భంగా ట్రై సిటి పరిధిలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎ.వి. రంగనాథ్, గురువారం వెల్లడించారు.

శుక్రవారం ఉదయం 09.00 నుండి రాత్రి 08.00 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. 

  •  ములుగు,భూపాలపల్లి వైపు నుండి వచ్చు భారీ వాహనములు హైదరాబాద్ కు వెళ్ళవలసినవి ఆరెపల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుండి వెళ్ళవలెను.మరియు భూపాలపల్లి పరకాల నుండి ఖమ్మం వెళ్ళవలసినవి ఆరేపల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుండి కరుణాపురం, మడికొండ, కడిపికొండ, నాయుడు పెట్రోల్ పంపు నుండి వెళ్ళవలెను.
  • భూపాలపల్లి మరియు పరకాల నుండి వచ్చు భారీ వాహనాలు నర్సంపేట వైపు వెళ్ళవలసినవి కొత్తపేట, రెడ్డిపాలెం, జాన్పీరిలు గొర్రెకుంట వెళ్ళవలెను.
  • సిటి లోపలికి వచ్చు భారీ వాహనములు సిటి అవతల ఆపుకోవలెను. మంత్రి గారి పర్యటనలో ఎలాంటి వాహనములు సిటి లోపలికి అనుమతించబడవు.
  • వరంగల్ నగరంలో తిరుగు అన్ని రకాల వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు
  • ములుగు మరియు పరకాల వైపు నుండి వచ్చే బస్సులు వయా పెద్దమ్మగడ్డ నుండి కెయుసి, సి.పి.ఓ. అంబేద్కర్ సెంటర్, ఏషియన్ శ్రీదేవి మాల్ మీదుగా బస్టాండ్కు చేరుకోవాల్సిఉంటుంది.
  • హన్మకొండ బస్టాండ్ నుండి బయలుదేరి ములుగు వైపు, కరీంనగర్ వైపు వెళ్ళు బస్సులు వయా ఏషియన్ శ్రీదేవి మాల్, అంబేద్కర్ సెంటర్, సి.పి.ఓ ద్వారా కెయుసి, జంక్షన్ మీదుగా వెళ్ళవలెను.
  • హన్మకొండ బస్టాండ్ నుండి బయలుదేరి నర్సంపేట, కొత్తగూడెం, భద్రాచలం, తొర్రూరు, ఖమ్మం వైపు వెళ్ళు బస్సులు వయా బాలసముద్రం, `అదాలత్, హంటర్ రోడ్ మీదుగా వెళ్ళవలెను.
  • వరంగల్ బస్టాండ్ నుండి హన్మకొండ వైపు వచ్చు బస్సులు చింతల్ బ్రిడ్జి నుండి రంగశాయిపేట్ మీదుగా నాయుడు పెట్రోల్ పంప్ సెంటర్, ఉర్సుగుట్ట, అదాలత్, బాలసముద్రం రోడ్ మీదుగా హన్మకొండకు చేరుకోవాలి. వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.
Please follow and like us:

Check Also

మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత

తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన చల్పూరి రవీంద్ర చారి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. కాగా సమాచారం తెలుసుకున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *