తెలంగాణఅక్షరం-హన్మకొండ
రెడ్డికాలనీలోని ఏకశిలా కాన్సెప్ట్ స్కూల్ లో తెలంగాణ ఆడపడుచుల విశిష్ట పండుగైన బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. నేడు విద్యార్థినులు రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి సుందరంగా అలంకరించి పాఠశాల ఆవరణంలో బతుకమ్మ ఆటను చప్పట్లతో సాంప్రదాయ ఉయ్యాల పాటలు ఆలపిస్తూ విద్యార్థులు బతుకమ్మ ఉత్సవాలను ఆనోందోత్సాహల మధ్య ప్రారంబించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి చైర్మన్ గౌరు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ప్రీతిపాత్రమైన బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను దాని నేపధ్యాన్ని వివిధ రకాల పూలను వాటి వినియోగం వెనుక ఉన్న విశిష్టతను ఆరోగ్య విషయాలను వివరించి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ స్వప్న రెడ్డి, ఉపాధ్యాయులు శోభ, జయ, స్వప్న, చైతన్య, పవన్, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.