పదిహేనేండ్లుగా మీతోనే ఉన్నాం..
పాడి కౌశిక్ రెడ్డి సతీమణి శాలినీ రెడ్డి
తెలంగాణఅక్షరం-వీణవంక
పదిహేనేండ్లుగా మీతోనే ఉన్నాం.. మీ కష్ట సుఖాల్లో పాలుపంచుకున్నాం.. కొంగుచాచి అడుగుతున్నాం.. ఈ సారి జరిగే ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీతోపాటే మీ కుటుంబ సభ్యుల్లా ఉంటామని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి మహిళలను ప్రార్థించారు. ఆమె మండలంలోని రెడ్డిపల్లి, ఘన్ముక్లతో పాటు పలు గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మహిళలకు నుదుట బొట్టుపెట్టి పెట్టి మహిళల దగ్గరకు వెళ్లి ఓటును అభ్యర్థించారు. ఈ ప్రాంత కోడలుగా, మీ కుటుంబ సభ్యుల్లా ఉంటూ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా యువతులతో సెల్పీలు దిగి వారితో నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుకాతిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ రాయిశెట్టి లతా శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు.