కాంగ్రెస్ కార్యకర్తలో జోలికొస్తే ఊరుకోబోం
కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితెల ప్రణవ్ బాబు
తెలంగాణఅక్షరం-వీణవంక
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి ఎవరూ వచ్చినా ఊరుకునేది లేదని, పార్టీ కార్యకర్తలకు అందరికీ అండగా ఉంటానని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితెల ప్రణవ్ బాబు అన్నారు. మండలంలోని చల్లూరు గ్రామంలోని ఓ ఫంక్షన్ హాలులో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు మాజీ సర్పంచులు, కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్ లో చేరగా వారికి ప్రణవ్ బాబు కంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసి ఎన్నికల్లో నియోజకవర్గంలో లక్ష ఓట్లకు పైగా ఓట్లు వేసేలే ప్రణాళికలు రూపొందించాలని ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు. పార్టీలో అతర్గత విభేదాలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. పార్టీ కార్యకర్తలందరూ ఒక్కతాటిపై నడిచి పార్టీలోని పటిష్టపరుచుకోవాలని సూచించారు. అలాగే పార్టీ అభివృద్ధితో పాటు గ్రామాల్లోని సమస్యలు, అభివృద్ధి పనులు పార్టీలకతీతంగా పరిష్కరించుకునేందుకు తన సహకారం తీసుకోవాలని సూచించారు. అందరికీ అండగా ఉంటానని ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన చల్లూరు, నర్సింహులపల్లి, మల్లారెడ్డిపల్లి మాజీ సర్పంచులు క్యాదాసు రాజమల్లయ్య, రాచమల్ల కుమార్ తో పాటు ఆయా గ్రామాల వార్డు సభ్యులతో పాటు గ్రామాల నాయకులు, కార్యకర్తలు ఏలె మధూసూదన్, ఎల్కపల్లి లక్ష్మణ్, తాండ్ర లక్ష్మణ్ తోపాటు పలువురు పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రణవ్ బాబును పలువురు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు కర్ర భగవాన్ రెడ్డి, కాంగ్రెస్ మండల చింతల శ్యాంసుందర్ రెడ్డి, వల్బాపూర్ ఎంపీటీసీ జీడి దేవేందర్, నాయకులు కొమ్మిడి రాకేష్ రెడ్డి, ఎక్కటి రఘుపాల్ రెడ్డి, పంజాల సత్తీష్, కొండాల్ రెడ్డి, సాహెబ్ హుస్సెన్, మ్యాక వీరయ్య, జైపాల్ రెడ్డి, హరీష్ రెడ్డి, మధూకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.