తెలంగాణఅక్షరం-వీణవంక
మండలంలోని చల్లూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ మహా గణపతి, పార్వతీ దేవి సమేత మహాలింగేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవ ఉత్సవాలు ఈ నెల 16 నుండి 19 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ గౌరవాధ్యక్షురాలు వాల శైలజబాలకిషన్ రావు తెలిపారు. ఆ ఆలయంలో ఆలయ ప్రతిష్టాపన ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆదివారం గ్రామస్తులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 16న గోపూజ, రథయాత్ర, గ్రామ పర్యాటన శోభయాత్రతో పాటు పలు పూజలు, 17న రుద్ర పారాయణం, ద్వారతోరణ పూజతో పాటు పలుపూజలు, 18న శుక్ల యజుర్వేద, సామవేద పారాయణంతో పాటు పలు పూజలు, 19న శ్రీ గణపతి, శ్రీ శివపార్వతుల ప్రతిష్టతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఆలయం గ్రామస్తుల సహకారంతో పాటు ప్రభుత్వ నిధులతో నిర్మించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. కావున మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఈ ఉత్సవాలకు హాజరై విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పొదిల రమేష్, పెద్ది మల్లారెడ్డి, రామిడి ఆదిరెడ్డి, జక్కు నారాయణ, కుమార్, సురేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.