డాక్టర్ తమిళ్ సై సౌందర్ రాజన్ తో బేటి అయిన ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతిరెడ్డి
తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళ్ సై సౌందర్ రాజన్ మరియు గవర్నర్ ప్రిన్సిపాల్ సెక్రటరీ శ్రీ సురేంద్ర మోహన్ I.A.S గార్లను ప్రముఖ విద్యావేత్త, ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతిరెడ్డి గారు రాజ్ భవన్ లో బేటి అవడం జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ గౌరు తిరుపతి రెడ్డి “నేటి విద్యా విధానం- సమూల మార్పులు” అనే అంశం పై నివేదికను గవర్నర్ గారికి అందజేయడం జరిగింది. ఇందులో ప్రస్తుతం భారతదేశంలో చదువులకు, ఉద్యోగ నైపుణ్యాలకు మధ్య సంబంధం ఉండడం లేదని, ప్రతి పది మందిలో ఒకరికి ఉద్యోగ నైపుణ్యాలు ఉంటున్నాయని, ఎప్పుడో కాలం చెల్లిన నాటి ఉద్యోగాలకు తగ్గట్టు విద్యాబోధన ఉండడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని తెలుపుతూ విద్యార్థులకు విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలను కూడా అందించాలని సూచించారు.సామాజిక, భావోద్వేగ అభివృద్ధి తో పాటు బతికేందుకు అనువైన సంపూర్ణమైన చదువు ప్రస్తుత విద్యా విధానంలో అవసరమని, బోధన పద్ధతులతో పాటు, నిర్మాణాత్మక బోధనా అంశాల్లో కూడా మార్పులు చేయాలని సూచించారు. కాలం చెల్లిన విద్యా విధానాలను వదిలేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన కోర్సులను పాఠశాల స్థాయి నుంచే విద్యా విధానంలో జోడించాలని తెలిపారు.గవర్నర్ డాక్టర్ తమిళ్ సై సౌందర్ రాజన్ స్పందిస్తూ ఎంతో అనుభవం ఉన్నటువంటి విద్యావేత్తలు, మేధావుల సలహాలను ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తీసుకొని మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యా విధానంలోఎప్పటికప్పుడు సమూల మార్పులు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కె ఎస్ ఆర్ పబ్లిషర్స్ అధినేత డాక్టర్ కేఎస్ఆర్ శ్రీనివాస్, విద్యా సంస్థల ప్రముఖులు సాంబయ్య, రవీంద్ర పాల్గొన్నారు.