-
బిగ్ బ్రేకింగ్ న్యూస్
-
ములుగు రోడ్డులోని ఐటీఐలో గంజాయి కలకలం
-
పట్టించుకోని యాజమాన్యం
తెలంగాణఅక్షరం-హన్మకొండ క్రైం
విద్యార్థులకు చదువు చెప్పాల్సిన అధ్యాపకులు వారిని పట్టించుకోకపోవడంతో విద్యార్థి దశలోనే వారు వ్యసనాలకు పాల్పడుతూ వారి భవిష్యత్ ను కోల్పోతున్నారు. తల్లిదండ్రులు వారిపై గంపెడాశాతో తమ కుమారులు మంచి స్థాయికి ఎదగాలనే కోరికతో వారి కష్టాన్ని సైతం లెక్క చేయకుండా తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలని తపన పడుతున్నారు. దీంతో తల్లిదండ్రులు వారిని అధ్యాపకుల చేతిలో పెట్టి తమ పిల్లల భవిష్యత్కు బాటలు వేయాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. కానీ అధ్యాపకులు పట్టించుకోకపోవడంతో పిల్లలు గంజాయి తాగుతూ తమ ఉజ్వల భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నారు. కానీ వారిని పట్టించుకోకుండా హన్మకొండ జిల్లా ములుగు రోడ్డులోని ఓ ఐటీఐలో ప్రిన్సిపల్, అధ్యాపక సిబ్బంది మాత్రం పిల్లలకు చదువు చెప్పకుండా వారిని పట్టించుకోకపోవడంతోనే వారు ఇలా చెడుదారిన పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు, కలెక్టర్, సీపీ చొరవ చూపి విద్యా సంస్థల్లో యాజమాన్యాలపై చర్యలు తీసుకుని విద్యార్థుల భవిష్యత్ ను కాపాడాలని పలువురు కోరుతున్నారు.