తెలంగాణ రాష్ట్ర యాదవ సంఘం నాయకులు చిన్నాల ఐలయ్య
తెలంగాణ అక్షరం-కరీంనగర్
కార్పొరేషన్ ఏర్పాటుతో యాదవులు కురుమల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. వీణవంక మండలంలో తెలంగాణ రాష్ట్ర యాదవ సంఘం నాయకులు చిన్నల ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదవ కురుమల సమస్యలు పరిష్కారం కోసం యాదవ కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షించ దగ్గ విషయమని అన్నారు. గత పాలకులు యాదవులను కురుమలను పట్టించుకున్న పాపానా పోలేదు ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం నిరంతరం యాదవ కురుమల సంక్షేమ అభివృద్ధి కొరకు పాటుపడుతున్నారని ఈ సందర్భంగా తెలిసింది. ఈ యొక్క కార్పొరేషన్కు కృషి చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర కేబినెట్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాము. రాబోయే రోజులల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి యాదవ కురుమలు అండగా ఉంటారని పేర్కొన్నారు.