నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు


నీటి ఎద్దడి తలెత్త కూడదు

సమీక్ష సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి

తెలంగాణ అక్షరం-మంగపేట

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కటిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద అభివృద్ధి మరియు త్రాగు నీటి సరఫరా పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ త్రిపాఠి మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా వేసవిలో ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు రాకుండా గ్రామ పంచాయితీ అధికారులతో పాటు మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో ట్రాన్స్కో అధికారులు బాధ్యతయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ తెలిపారు.ప్రజలు తాగునీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని కోరారు. ప్రత్యేకించి త్రాగు నీరు వృధా కాకుండా లీకేజీలు ఉన్న చోట వెంటనే మరమ్మత్తులు చేయించదాంతో పాటు శానిటేషన్ పై కూడా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అధికారులను ఆదేశించారు.అవసరం ఉన్న చోట హ్యాండ్ పంపులు,బోర్ వెల్సు ద్వారా నీటిని అందించే ఏర్పాట్లు చేయాలన్నారు.వేసవిలో విద్యుత్ సమస్య రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్కో అధికారులను సూచించారు. ప్రజలకు తమ సేవలను అందించడంలో అధికారులు తమ పనితీరును మెరుగుపర్చుకుని బాధ్యతగా వ్యవహరించకపోతే వేటు తప్పదని హెచ్చరించారు.

వినతుల వెల్లువ

సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ త్రిపాఠికి ప్రజల నుండి వినతులు వెల్లువెత్తాయి. ముఖ్యంగా మండలంలోని కమలాపురం బిల్ట్ పరిశ్రమ కార్మికులు కలెక్టర్ తో తమ గోడువెళ్లబోసుకున్నారు. యాజమాన్యం తమకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతుందని తెలిపారు. స్పందించిన ఆమె ప్రస్తుతం పరిశ్రమ పిన్ క్వెస్ట్ సంస్థ ఆధీనంలో వుండడంతో పిన్ క్వెస్ట్ ప్రతి నిధులను పిలిపించి మాట్లాడారు. పరిశ్రమ నిబంధనల ప్రకారం కార్మికులకు చెల్లించవలసిన బకాయిలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని త్రిపాఠి వెల్లడించారు. గత పది సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న తమ భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఏటూరునాగారం మండలం ఆకుల వారి ఘనపురం గ్రామానికి చెందిన పూనెం నిర్మల కన్నీటి పర్యంతమయ్యారు. మండలంలోని తిమ్మపేట గ్రామంలో గల తమ 5 ఎకరాల 30 గుంటల భూమిని అడ్డదారుల్లో చేజిక్కించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరగా రెవెన్యూ అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.అనంతరం ఎం పి డి ఓ కార్యాలయం లో పోషన పక్షంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆర్ డబ్లూఎస్ సిఈ శ్రీనివాస్, సూపర్డెంట్ ఆఫ్ ఇంజనీర్ మిషన్ భగీరథ కె. మల్లేష్, ఈ ఈ మాణిక్య రావు, మండల ప్రత్యేక అధికారి తుల రవి, డిడబ్లుఓ స్వర్ణలత, లెనిన, ఎంపీడీవో కృష్ణ ప్రసాద్, తాహాసిల్దార్ వీరాస్వామి, ఎం పి ఓ మమత గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శుల, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

Check Also

మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత

తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన చల్పూరి రవీంద్ర చారి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. కాగా సమాచారం తెలుసుకున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *