తెలంగాణ అక్షరం, మంగపేట
వార్షిక వేదాధ్యయనంలో భాగంగా బుదవారం మండలంలోని కమలాపురం బిల్ట్ కాలనీలో పద్మావతి, అలివేలుమంగల సమేతంగా వెంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు వైభవంగా జరిపారు. వేదాధ్యయనంలో భాగంగా ఉదయం 8 గంటలకు స్వామి వారి కి అభిశేకం నిర్వహించారు. అనంతరం ఉదయం 11 గంటలకు శ్రీ పధ్మావతి, అలివేలుంమం గా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని వేద మంత్రాల నడుమ అర్చకులు కలకోట రామాచార్యులు , ప్రతాపురం వంశీకుమారాచార్యులు జీడికంటి మదుసూదనాచార్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు అర్చకులు ప్రతాపురం శ్రీనివాసచార్యాలు, ఫిన్ క్విస్ట్ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ సీనియర్ మేనేజర్ ప్రసాద్ నాయర్, కోరుకోప్పుల శంకర్, గూడ యాదగిరి, సిద్దంశేట్టి లక్ష్మన్ రావు, నల్లూరి పద్మారావు, కోనేరు రాంబాబు, సిద్దంశెట్టి శ్రీనివాసరావు, నల్లూరి శ్రీనివాసరావు, వంగేటి వెంకటరెడ్డి, రామిడి సురేష్, ఫిన్ క్విస్ట్ సిబ్బంది ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.