తెలంగాణ అక్షరం – మంగపేట
ప్రమాదవశత్తు ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన బుదవారం మండలంలోని జబ్బోనిగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. సంఘటన వివరాలు ఇలా వున్నాయి. మండల కేంద్రంలోని పొద్మూర్ కు చెందిన మహమ్మద్ యాకూబ్ పాషా 35 బుధవారం ఉదయం రోడ్డు పనికి వెళ్ళాడు. తిరిగి వస్తున్న క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ట్రాక్టర్ నడుపుతున్న పాషా అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై గోదరి రవికుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పోస్ట్ మార్ట్ నిమిత్తం మృత దేహాన్ని ఏటూరునాగారం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య రేష్మ ,ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు వున్నారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.