వధూవరులకు బోయినపల్లి, కౌశిక్ రెడ్డి ఆశీర్వాదం
తెలంగాణ అక్షరం-హుజురాబాద్
హుజురాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట, వీణవంక, హుజురాబాద్ మండలాలలో గురువారం జరిగిన పలు వివాహ వేడుకలు మరియు జమ్మికుంట లోని ఆంజనేయస్వామి వార్షికోత్సవాల్లో మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించారు. జమ్మికుంట హనుమాన్ దేవాలయంలోని వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసే ఆశీర్వచనాలు పొందారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు టంగుటూరి రాజకుమార్, జమ్మికుంట పిఎసిఎస్ చైర్మన్ పొనగంటి సంపత్, వివిధ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.