కెసిఆర్ వి కల్లబొల్లి మాటలు
పంటలు ఎండబెట్టి పర్యటనలు
శివరాయకట్టుకు నిరంధిస్తున్న ప్రభుత్వం మీద కుట్రలు
లస్మక్కపల్లి లో చివరి ఆయకట్టు పంటలను పరిశీలించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి
తెలంగాణ అక్షరం-వీణవంక
వీణవంక మండలం లస్మక్కపల్లి గ్రామ చివరి ఆయకట్టును మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి రైతులతో కలసి పరిశీలించారు. సాగు నీటి సమస్య ఏమైన ఉందా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. సాగు నీరు సమయానికి అందుతున్నాయని రైతులు తెలిపారు. అనంతరం తుమ్మేటి సమ్మిరెడ్డి మాట్లాడుతూ లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ పక్క దారి పట్టించేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నారని తెలిపారు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇలాఖలో కావాలనే పొలం ఎండబెట్టి డ్రామాలు ఆడుతున్నారని మండి పడ్డారు. చివరి ఆయకట్టు వరకు సాగు నీరు పుష్కలంగా అందుతుందని రైతులు చెబుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కాలేదని, పంటలు ఎండుతున్నాయంటూ గగ్గోలు పెట్టడం సిగ్గు చేటు అన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఒక గుంటలో కూడా పంట ఎండలేదన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పొలం ఎండిందో లేదో ప్రజలకు చూపించాలని సవాల్ చేశారు. కేసీఆర్ జూట మాటలు ఇక తెలంగాణ ప్రజలు నమ్మరని గుర్తు పెట్టుకోవాలన్నారు. రైతులు మాట్లాడుతూ పంట పొలాలకు విద్యుత్ అంతరాయం కలవకుండా 18 గంటలు ఇస్తున్నారని వారాబంది నీళ్లు ద్వారా క్రమం తప్పకుండా వస్తున్నాయి ఇంకో రెండు తడులు నీరు ఇస్తే గుంట పంట కూడా నష్టపోకుండా పండుతాయని ప్రభుత్వాన్ని రైతులు వేడుకుంటున్నారు. అలాగే ఇటీవల హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు హాజరై మండల కేంద్రంలో టీ కొట్టు వద్ద టీ తాగుతూ పక్కన వైండింగ్ షాప్ ఉండడంతో అతని దగ్గరికి వెళ్లి కరెంటు అంతరాయంతో మోటార్లు కాలుతున్నాయని తప్పులు సమాచారం ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారని విద్యుత్ అధికారులు నాణ్యమైన విద్యుత్తును ఇప్పటికే అందిస్తున్నారని రైతులు అంటున్నారు. ఈ పంటల పరిశీలనలోపి సిసి మెంబర్ కర్ర భగవాన్ రెడ్డి, సీనియర్ నాయకులు నల్ల కొండల్ రెడ్డి, మాజీ సర్పంచ్ దాసరపు సుజాత లక్ష్మణ్, మాజీ ఉపసర్పంచ్ మేకల సమ్మిరెడ్డి, నల్ల కొండల్ రెడ్డి,సత్యనారాయణ,మందాటి అనిల్ రెడ్డి,లస్మక్కపల్లి గ్రామ రైతులు బొంకురి సమ్మయ్య,కూర రాజిరెడ్డి,మేకల రాజిరెడ్డి, లింగాల సమ్మిరెడ్డి, మర్రి సమ్మయ్య,మేకల కోమల్ రెడ్డి,రెడ్డిరాజుల కోమల్,మేకల ఇంద్రారెడ్డి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.