తెలంగాణఅక్షరం-వీణవంక
వీణవంక మండల కేంద్రంలో ని బస్టాండ్ కూడలి వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314 వర్థంతి వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న చిత్ర పటానికి పూల పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ మూడు వందల సంవత్సరాల క్రితమే సాయుధ పోరాటం చేసి మొగుల ల సామ్రాజ్యాన్ని జయించి హైదరాబాద్ కోటను ఏలిన గొప్ప వ్యక్తి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని తెలిపారు.ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న మద్యం బెల్ట్ షాపులను పూర్తి స్థాయిలో నిషేధించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గీత కార్మిక సంఘం అధ్యక్షులు దొమ్మటి రాజమలు గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మ్యాడగోని బుచ్చయ్య గౌడ్, జిల్లా కార్యదర్శి గట్టు మధు, మ్యాడగోని శ్రీనివాస్ గౌడ్, పున్నం కొండల్ గౌడ్, పూదరి అనిల్ గౌడ్, బొనుగాని ఎల్లయ్య గౌడ్, మ్యాడగొని మొగిలి గౌడ్, తోడేటి శ్రీనివాస్ గౌడ్, పైడిమల్ల శ్రీనివాస్ గౌడ్, ఉయ్యాల రాజ్ గౌడ్, మ్యాడగోని శ్రీనివాస్ గౌడ్, గట్టు స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.