నియోజకవర్గ కేంద్రంలో పొన్నం మార్నింగ్ వాక్
తెలంగాణఅక్షరం-హుస్నాబాద్
పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా రాష్ర్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓటర్లను వినూత్నంగా తనదైనశైలీలో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. హుస్నాబాద్ పట్టణంలో పలువురు యువకులు, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి మంగళవారం మార్నింగ్ వాక్ చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలను గుడ్ మార్నింగ్ అంటూ తనదైన శైలీలో పలుకరిస్తూ ముందుకు సాగారు. కూరగాయల మార్కెట్ లో కూరగాయల విక్రయదారుల సాదకబాదకాలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పట్టణంలోని వివిధ కారణాలతో అనారోగ్యానికి గురై చికిత్స పొందిన పలువురిని పరామర్శించి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వీణవంక మండలానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నల్ల కొండాల్ రెడ్డి మంత్రి పొన్నంను మర్యాదపూర్వకంగా కలిశారు.