హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
మృతుల కుటుంబాలకు పాడి పరామర్శ
తెలంగాణ అక్షరం-హుజురాబాద్
బోర్నపల్లిలో శుక్రవారం రాత్రి జరిగిన టిప్పర్ లారీ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శనివారం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బోర్నపల్లి లో జరిగిన పెద్దమ్మ జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఒక్కో కుటుంబానికి చెందిన అన్నా చెల్లెలు గంట విజయ్, వర్ష, సింధుజ లు మృత్యువాత పడ్డారు. సంఘటన వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ప్రమాదకారులకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ మాజీ టూరిజం, చైర్మన్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శీను గందే శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.