- పోలీసులకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు
- ముగ్గురు మావోయిస్టులు మృతి
- తుపాకులు, మందు గుండు సామాగ్రి స్వాధీనం
తెలంగాణ అక్షరం-ములుగు
అడవుల్లో మళ్లీ తుపాకీ మోతలు మోగాయి. పచ్చని నేలంతా రక్తం పారింది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు-ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. తప్పించుకునే క్రమంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు జరిపిన ఫైరింగ్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో ఏకే-47తోపాటు మూడు తుపాకులు, పేలుడు పదార్థాలు లభించాయని చెప్పారు. ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.