తెలంగాణఅక్షరం-వీణవంక
పేకాట ఆడుతున్న ఆడుతున్నపలువురిని శుక్రవారం పట్టుకున్నట్లు వీణవంక ఎస్సై తోట తిరుపతి తెలిపారు. ఎస్సై తిరుపతి కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని కనపర్తి శివారులోని మేకల నారాయణ రెడ్డి వ్యవసాయ భూమి సమీపంలో పలువురు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో అక్కడికి వెళ్లి గమనించగా అటుకుల మహేందర్, ఉయ్యాల మహేందర్, ఉయ్యాల భిక్షపతి, అడిగొప్పుల మల్లేశం, బూర్తుల ప్రకాష్, యాలం రమణారెడ్డి, మ్యాడగోని తిరుపతిగౌడ్, ఆలేటి శ్రీనివాస్ రెడ్డి, నల్ల కొమాల్ రెడ్డి, చింతల నరసింహారెడ్డి, పర్లపల్లి తిరుపతి, ఉయ్యాల శ్రీనివాస్ లు పేకాట ఆడుతున్నారు. కాగా వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద రూ.49760, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ పేకాట ఆడితే కఠిన చర్చలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో ఎవరైనా చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.