బ్రహ్మోత్సవాలపై అధికారుల సమీక్ష సమావేశం..
తెలంగాణ అక్షరం-ఇల్లందకుంట
ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలపై సోమవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో హుజురాబాద్ ఆర్డిఓ రమేష్ బాబు ఏసిపి శ్రీనివాస్ జి కలసి అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీవో రమేష్ బాబు మాట్లాడుతూ ఈనెల 17న జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని భక్తుల సౌకర్యార్థం కొరకు అన్ని ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు కళ్యాణానికి వచ్చే వేలాదిమంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచినీటి సౌకర్యం వైద్యం విద్యుత్తు భారీ కె డ్స్ క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని అన్నారు సుదూర ప్రాంతం నుండి వచ్చే భక్తులకు ఆర్టీసీ ఆధ్వర్యంలో బసౌకర్యం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు అలాగే రైస్ మిల్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించే ప్రదేశంలో అన్ని సౌకర్యములు నిర్వహించాలని తెలిపారు ఆలయ ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ పోలీసు బందోబస్తు నిర్వహించాలని ఏసిపి నీ కోరారు రెవెన్యూ విద్యుత్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఆర్ అండ్ బి మున్సిపల్ శాఖ పోలీస్ అధికారులు అందరూ కలిసి సమన్వయంతో శ్రీరామనవమి వేడుకలను విజయవంతం చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి కందుల సుధాకర్ జమ్మికుంట ఇల్లందకుంట వీణవంక హుజురాబాద్ మండలాలకు చెందిన తాసిల్దార్లు జమ్మికుంట హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్లు వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు