పోతిరెడ్డిపల్లిలో అంగరంగ వైభవంగా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన
తెలంగాణ అక్షరం-వీణవంక
మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో శ్రీ రేణుక ఎల్లమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో బుధవారం రోజున గౌడ కులస్తులు ఆలయ ఆవరణలో వేద పండితుల ఆధ్వర్యంలో ఆత్మంత వైభవంగా సామూహిక విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా నిర్వహించారు.గౌడ కులస్తులు, కుటుంబ సభ్యుల సమేళంగా, కుల దేవత అయిన రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కోసం నూతన వస్త్రాలు ధరించి, ఆచార సంప్రదాయాలతో ఆలయ ప్రాంగానికి డప్పు చప్పులతో చేరుకున్నారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు విగ్రహ ప్రతిష్టాపనను అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గౌడ సంఘ కులస్తులు,కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.