తెలంగాణఅక్షరం-వీణవంక
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ ను గెలిపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి క్రిష్ణారెడ్డి ప్రజలను కోరారు. మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కార్యకర్తలతో కలిసి ఇంటింటా తిరిగి బీజేపీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అలాగే వీణవంక మండల కేంద్రంలోనూ ఆ పార్టీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాడ గౌతమ్ రెడ్డి, ఆదిరెడ్డి, దేవేందర్ రెడ్డి, వీరారెడ్డి, గణేష్, కొమాల్ రెడ్డి, శ్రీనివాస్, బత్తిని నరేష్ గౌడ్, కంకల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Please follow and like us: