తెలంగాణ అక్షరం-వీణవంక/చిట్యాల
పశుగ్రాసాన్ని తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తాకడంతో పశు గ్రాసంతో పాటు వ్యాను దగ్ధమైన సంఘటన బ్రాహ్మణపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు, గ్రామస్తుల కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలానికి చెందిన జూకల్ గ్రామానికి చెందిన సురపు రవీందర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామం నుండి పశుగ్రాసాన్ని తీసుకెళ్లి పోవడానికి సోమవారం వచ్చారు. గ్రామంలోని ఓ రైతుకు చెందిన పొలం నుండి 190 గడ్డి కట్టలను డీసీఎం వ్యానులో వేసుకొని వెళ్తుండగా గ్రామ శివారులో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు గడ్డి కట్టలు తాకడంతో ఒకేసారి నిప్పు అంటుకుంది. గడ్డి కాలుతుండగా ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇవ్వడంతో వచ్చేసరికి అప్పటికే గడ్డి కట్టలు పూర్తిగా కాలిపోగా వ్యాను గల నెంబరు TS 12 UD 1470 గడ్డి కట్టలతో పూర్తిగా కాలిపోగా వ్యాను 70% కాలిపోయింది. ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలు వ్యాపించకుండా నీటితో ఆర్పారు.