కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్
తెలంగాణ అక్షరం-జమ్మికుంట, వీణవంక
జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభకు వచ్చి వడదెబ్బతో వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అంబాల ఐలమ్మ మృతి చెందడం బాధాకరమన్నారు. మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు కర్ర భగవాన్ రెడ్డి, అడిగొప్పుల సంపత్, మందల అనిల్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Please follow and like us: