తెలంగాణ అక్షరం-వీణవంక
తమతో కలిసి చదువుకున్న తోటి స్నేహితుడు అనారోగ్యానికి గురై అకాల మరణం చెందడంతో అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన రాంపల్లి సాయికుమార్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో (1996-97 పదవ తరగతి బ్యాచ్) చదువుకున్నాడు. సాయి కుమార్ కు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. సాయికుమార్ అనారోగ్యానికి గురై మృతి చెందడంతో వారి కుటుంబానికి అండగా నిలవాలని తోటి స్నేహితులు అందరూ కలిసి రూ.51,500 లు జమ చేసి, సోమవారం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్నేహితులు తిరుమల దేవి, రాధాకృష్ణ, సంపత్, శంకర్, డా. తిరుపతి, అక్బర్, తదితరులు పాల్గొన్నారు.
Please follow and like us: