తెలంగాణ అక్షరం వీణవంక
కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వడిదల ప్రణవ్ బాబు సమక్షంలో పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్, బిజెపి పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కాంగ్రెస్ లో సోమవారం చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ప్రణవ్ బాబు కాంగ్రెస్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రణవ్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడే విధంగా సంక్షేమ పథకాలు తీసుకొస్తుంటే ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఆయా పార్టీల నుండి కాంగ్రెస్లో చేరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు కల్లబొల్లి మాటలతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతూ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి పై బురద చల్లడం మానుకోవాలని సూచించారు. గ్రామానికి చెందిన పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్, బిజెపి నాయకులు తిప్పని అజయ్ గౌడ్, వీర్ల రఘు, గెల్లు అశోక్, తిప్పని సంతోష్ ,ఆషాడపు వినయ్, రాపర్తి అక్షయ్ లు పోతిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ బంజారా అనూష పంజాల అనూష సతీష్ గౌడ్ చేపూరి రాజు రాపర్తి రవి సమక్షంలో పార్టీలో చేరారు.