మోదీ గుండెలో బండికి ప్రత్యేక స్థానం
సౌతిండియాలో బీజేపీని బలోపేతం చేసేందుకు బండి సంజయ్ జాతీయ పదవిచ్చ
బండి స్పూర్తితోనే తమిళనాడులో పాదయాత్ర
*60 శాతం ఓట్లతో సంజయ్ ను గెలిపించండి*
బండి సంజయ్ గెలిస్తే సామాన్యుడు గెలిచినట్లే
తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై అద్బుత ప్రసంగం
బండి సంజయ్ పోరాటాలను,నాయకత్వాన్ని కొనియాడిన అన్నామలై
తెలంగాణ అక్షరం-జమ్మికుంట (కరీంనగర్)
ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుండెలో బండి సంజయ్ కుమార్ కు ప్రత్యేక స్థానం ఉందని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అన్నామలై అన్నారు. దక్షిణ భారత దేశంలో బీజేపీని బలోపేతం చేసేందుకు బండి సంజయ్ కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారని చెప్పారు. బండి సంజయ్ చేసిన పోరాటాలు దేశానికే ఆదర్శమయ్యాయన్నారు. సంజయ్ పాదయాత్ర స్పూర్తితోనే తమిళనాడులో తాను పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేసి లాఠీలు, కేసులకు భయపడకుండా జైలుకు వెళ్లిన చరిత్ర సంజయ్ కే సొంతమన్నారు. బండి సంజయ్ గెలిస్తే సామాన్యుడు గెలిచినట్లేనన్నారు. మొత్తం పోలైన ఓట్లలో 60 శాతం ఓట్లు బండి సంజయ్ కే పడేలా ఇంటింటికీ తిరిగి గెలిపించాలని యువతకు పిలుపునిచ్చారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో జరిగిన బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సమ్మేళనానికి బండి సంజయ్ తోపాటు తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై, కరీంనగర్, రాజన్ని సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, ప్రతాపరామక్రిష్ణ తదితరులు హాజరైన ఈ సమావేశంలో అన్నామలై ప్రసంగం అద్బుతంగా సాగింది. అన్నామలై ప్రసంగిస్తున్నంత సేపు చప్పట్లు, ఈలలతో యువత కేరింతలు కొట్టారు. ముఖ్యంగా బండి సంజయ్ పోరాటాలను, పార్టీ బలోపేతానికి చేసిన సేవలను, పాదయాత్ర చేసిన తీరును వివరిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ ఆసక్తి విన్నారు. బండి అభిమానులు ఆనందభాష్పాలు రాల్చారు.. ఈ సందర్భంగా అన్నామలై ఏమన్నారంటే…
అన్నామలై… అందరికీ నమస్కారం.. అందమైన తెలుగు భాషను మాట్లాడలేకపోతున్నందుకు క్షమించాలి. బండి సంజయ్ అద్భుతమైన నాయకుడు. ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటుతున్నడు. పోరాట యోధుడు. బండి సంజయ్ తెలంగాణకే కాదు.. దక్షిన భారతదేశానికి నాయకుడిని అందించారు. బండి సంజయ్ పాదయాత్ర స్పూర్తితోనే నేను తమిళనాడులో పాదయాత్ర చేసిన. నాకు ఏ నాయకుడు అధ్యక్షహోదాలో ఉంటూ అరెస్ట్ కాలేదు.. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి చేస్తే.. దానిపై పోరాడినందుకు అనేకసార్లు అరెస్టయిన నాయకుడు బండి సంజయ్. ఆయన సేవలను గుర్తించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. ఆయన దక్షిణ భారత దేశంలో పార్టీని బలోపేతం చేస్తారనే నమ్మకం ఉంది.
బండి సంజయ్ యూత్ ఐకాన్. యువత ఆలోచనలను, ఆవేశాన్ని, కుటుంబ పాలన అవినీతి పోరును ప్రదర్శిస్తున్నారు. అందుకే బండి సంజయ్ చారిత్రాత్మక విజయాన్ని కరీంనగర్ ప్రజలు అందించబోతున్నారనే నమ్మకం ఉంది. కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరుతో ఓట్లు దండుకుని గద్దె నెక్కాక వాటిని పూర్తిగా విస్మరించింది. మహిళలకు రూ.2500లు ఇవ్వనేలేదు. రూ.4 వేల పెన్షన్ ఇవ్వనేలేదు. రూ.5 లక్షల విద్యార్థి భరోసా కార్డు ఇవ్వనేలేదు. రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కులీలకు రూ.12 వేలు ఇవ్వనేలేదు. ఇంటి జాగా, రూ.5 లక్షల సాయం చేయనేలేదు… అబద్దాలనే పునాదులపైనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గుజరాత్ తో తెలంగాణ పోటీ అంటున్న రేవంత్ రెడ్డి… గుజరాత్ లో సబర్మతి నదిని ఏ విధంగా ప్రక్షాళన చేశారో… మూసీ నదిని మీరెందుకు ప్రక్షాళన చేయలేదు… తమిళనాడులో పంట నష్టపోతే పరిహారం అందిస్తాం… మరి తెలంగాణలోఎందుకు ఇవ్వడం లేదు. కిసాన్ సమ్మాన్ నిధిని యూజ్ లెస్ స్కీంగా కేసీఆర్ తీసిపారేశారు…కానీ రైతులకు మాత్రం మెరుగైన సాయం ఎందుకు చేయలేకపోయారు?
బండి సంజయ్ అన్న నాయకత్వంలో పోరాటాలే కాదు.. కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు కూడా తీసుకొచ్చి అభివ్రుద్ధి చేశారు. ఈ దేశంలో రైతుల, యువత, మహిళల, విద్యార్థుల వ్యతిరేకి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమే. కరీంనగర్ లో 47 సెం.మీల వేడి. అసలే కరీంనగర్ లో ఎండ వేడి. బండి సంజయ్ అన్న పోరాటంతో హీట్ డబులైంది… ఇకపై మీరంతా ఒక్కొక్క యువ మోర్చా నాయకుడు.. 100 మంది బీజేపీయేతర ఇండ్లకు వెళ్లాలి. వారిని ఒప్పించాలి. సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు నేను రెండుసార్లు వచ్చారు. విపరీతమైన ఎండలో, చెమట చిందుస్తూ చిరునవ్వు నవ్వుతూ తనవద్దకు పోటీలు పడుతూ వస్తున్న వాళ్లకు సెల్ఫీలిస్తూ ప్రజా సమస్యలపై పాదయాత్ర చేశారు.
బండి సంజయ్ కు 60 శాతం ఓట్లు రావాలి… మిగిలిన పార్టీలకు 40 శాతం పార్టీలు పడాలి. ఎందుకంటే బండి సంజయ్ ను అడుగడుగునా అవమానించారు. ప్రజా సమస్యలపై పోరాడితే అరెస్టులు చేశారు. జైలుకు వెళ్లారు. ఫోన్ ట్యాపింగ్ తో కుటుంబాన్ని ఇబ్బంది పడ్డారు. మోదీ కోసం 5 రోజులు కష్టపడండి… మోదీ మీకోసం 5 ఏళ్లు కష్టపడి సేవ చేస్తారు. బండి సంజయన్న… మేం కరీంనగర్ చూసుకుంటాం… మీరు రాష్ట్రమంతా తిరగండి. ఊరూరు తిరిగి బీజేపీని గెలిపించండి.
బండి సంజయ్ ఏమన్నారంటే…
భారతదేశ సింగమలై… మన అన్నామలై. అత్యున్నతమైన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరి ప్రజాసమస్యలపై యుద్దం చేస్తున్న నేత అన్నామలై. నిరంతరం పాదయాత్ర చేస్తూ కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉన్న నాయకుడు. తమిళనాడులో బీజేపీ శక్తివంతంగా తయారు కావడంలో అన్నామలై కీలక పాత్ర పోషించారు.
మేం పువ్వు గుర్తుపై ఓటేయాలని తిరుగుతుంటే… సీఎం రేవంత్ రెడ్డి మాత్రం గాడిద గుడ్డు గుర్తు పట్టుకుని తిరుగుతున్నరు. కాబట్టి కాంగ్రెస్ కు ఓటేయాలనుకునే వాళ్లు బ్యాలెట్ లో గాడిద గుడ్డు గుర్తు ఉంటేనే ఓటేయండి.
మోదీపై విషం చిమ్ముతున్న కాంగ్రెస్ నాయకులను చూసి జనం నవ్వుకుంటున్నరు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడం లేదు. కరీంనగర్ లో ఆ పార్టీ 3వ స్థానంలో ఉంది.
కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అమలు చేస్తామని మోసం చేసింది. మహిళలకు రూ.2500లు ఇవ్వలేదు. రూ.4 వేల పెన్షన్ ఇవ్వలేదు. రూ.5 లక్షల విద్యార్థి భరోసా కార్డు ఇవ్వలే. రైతు భరోసా కింద రూ.15 వేలు ఇవ్వలేదు. ఇంటి జాగా, రూ.5 లక్షల సాయం చేయలేదు… ఇవేమీ ఇవ్వనందున జనం తిడుతుంటే.. చర్చను దారి మళ్లించేందుకే రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు గుర్తు పేరుతో చర్చను పక్కదారి పట్టించారు.
ధరల పెరుగుదల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలారా… యూపీఏ 10 ఏళ్లలో రూ.12 లక్షల కోట్ల స్కాంలకు పాల్పడింది. 2జీ, బొగ్గు, సహారాసహా గాలి, నీటితోసహా అన్ని రకాల స్కాంలకు పాల్పడింది. వీళ్లా ధరల పెరుగుదల గురించి మాట్లాడేది?
కరీంనగర్ లో బీజేపీ గెలవాలి. దేశంలో మళ్లీ మోదీ ప్రధాని కావాలి. మాకు దేశం ముఖ్యం. ఈ దేశం రక్షించబడాాలంటే ఏకైక నాయకుడు మోదీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీకి కెప్టెన్ (ప్రధాని అభ్యర్ధి) లేరు. పేదల గురించి ఆలోచించడం లేదు.