తెలంగాణ అక్షరం-వీణవంక
హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వోడితల ప్రణవ్ ఆధ్వర్యంలో వీణవంక గ్రామానికి చెందిన యువ నాయకుడు దాసారపు కృష్ణ కాంత్ (కిట్టు) కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరగా వీరికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి వివిధ గ్రామాల్లోని ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. యువకులు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అలాగే యువకులతోనే పార్టీ మరింత బలపడేందుకు దోహదపడుతుందని కృష్ణకాంత్ మాట్లాడుతూ..రానున్న రోజుల్లో హుజురాబాద్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. యువతకు కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి అవకాశాలు అందుతాయని అన్నారు. వీరి వెంట యువకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.