తెలంగాణ అక్షరం-వీణవంక
మండలంలోని కనపర్తి గ్రామానికి చెందిన గ్రామ బీఆర్ఎస్ కు చెందిన తాజా మాజీ సర్పంచ్ పర్లపల్లి రమేష్, బిజెపికి చెందిన తాజా మాజీ ఉపసర్పంచ్ అల్లపురెడ్డి దేవేందర్ రెడ్డి, కొయ్యడ మొగిలి, రామంచి పూర్ణచందర్, తడిగొప్పుల శ్రీనివాస్, దాసారపు శివలు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి ప్రణవ్ బాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రామంలో స్వీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు.ఈకార్యక్రమంలోకాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి, నాయకులు ప్రసాద్, పత్తి సమ్మిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.