తెలంగాణ అక్షరం-వీణవంక
వరి ధాన్యానికి క్వింటాల్ రూ.500 బోనస్ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బిజెపి మండల శాఖ అధ్యక్షుడు రాముడి ఆదిరెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.వీణవంక మండలంలో ఆకాల వర్షాలతో తడిసిన వరి ధాన్యాన్ని బీజేపీ మండల శాఖ ఆధ్వర్యలో బిజెపి శ్రేణులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు వరి ధాన్యాన్ని ఎలాంటి అంక్షలు లేకుండా, కటింగ్ లేకుండా కొనుగోలు చేసి మద్దతు ధరకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను విస్మరించి రైతులను ఘోరంగా మోసం చేశారని దుయ్యబట్టారు. వరి ధాన్యం కొనుగోలుకు ముందు సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమీక్ష జరపవలసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల గురించి పట్టించుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. రైతుల పట్ల ముసలి కన్నీరు కారుస్తూ నిన్న సమీక్ష పేరిట రైతులను మభ్య పెట్టడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని, కాని ఇప్పటికే 80% ధాన్యం కొనుగోలు పూర్తి కావడం జరిగిందని,వరి ధాన్యం అమ్ముకున్న రైతులకు జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా పూరిస్తదో చెప్పాలని ఆదిరెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్ల మీద వన్న ధ్యాస రైతుల పట్ల లేకపోవడం బాధాకరమని ఆక్షేపించారు. వెంటనే తడిసిన వరి ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి గింజ కొనుగోలు చేసి, క్వింటాల్ వరి దాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వీణవంక మండల అధ్యక్షుడు ఆదిరెడ్డి డిమాండ్ చేశారు. లేనట్లయితే రైతులను కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో అబద్ధపు మాటలతో గద్దెనెక్కి ఈరోజు వరకు కూడ ఏ ఒక్క హామీని అమలు చేసిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. రైతులకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ మహిళల అకౌంట్లోకి రూ.2500 లతో పాటు ఫసల్ బీమా యోజన అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట కౌన్సిల్ సభ్యులు రఘు, జిల్లా కార్యదర్శి నరసింహ రాజు, మండల పార్టీ అధ్యక్షులు రామిడి ఆది రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు నరేశ్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి బొంగోని సదానందం గౌడ్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు బొంగోని ఎల్లా గౌడ్, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి మారం తిరుపతి రెడ్డి, సీనియర్ నాయకులు పెద్ది మల్లారెడ్డి, బూత్ అధ్యక్షులు బుర్ర సదానందం, రాజబాబు రాజయ్య, మోటం శ్రీనివాస్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.