జూన్ 10వ తేది చివరి గడువు
దరఖాస్తు చేసుకోవాలంటున్న వరంగల్ ఐటీఐ ప్రిన్సిపల్ జుమ్లా నాయక్
తెలంగాణఅక్షరం-వరంగల్
2024-2025 విద్యా సంవత్సరంనకు గాను ఐటీఐ కోర్సుల్లో ప్రవేశానికి గాను దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు వరంగల్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ జుమ్లా నాయక్ తెలిపారు. జూన్ 10 వ తేదీ వరకు ప్రభుత్వం చివరి గడువును నిర్ణయించినట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ‘తెలంగాణ అక్షరం’తో మాట్లాడారు. వరంగల్ ఐటీఐలో నాణ్యమైన విద్య అందుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు, వృత్తి నైపుణ్యం పెంపొందించుకునేందుకు ఐటీఐ కోర్సులు ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. కావున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆలోచించి పిల్లలను దరఖాస్తు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని సూచించారు.
ట్రేడ్, సీట్లు, అర్హతల వివరాలు :
ఎలక్ట్రిషన్ (80 సీట్లు) పదో తరగతి
ఫిట్టర్ (60 సీట్లు) పదో తరగతి
టర్నర్ (40 సీట్లు పదో తరగతి
మిషనిస్ట్ (20 సీట్లు) పదో తరగతి
మెకానిక్ మోటర్ వెహికిల్ (24సీట్లు) పదో తరగతి
డ్రాఫ్ట్స్ మెన్ సివిల్ (24సీట్లు) పదో తరగతి
మెకానిక్ డిజిల్ (48సీట్లు) ఎనిమిదో తరగతి
వెల్డర్ (60 సీట్లు) ఎనిమిదో తరగతి
సీ.వో.పీ.ఏ (48 సీట్లు) ఎనిమిదో తరగతి
దరఖాస్తునకు కావాల్సిన ధృవ పత్రాలు
ఆయా ట్రేడ్ లకు సంబంధించి విద్యార్హత ప్రతాలు, కుల ధృవీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాస్ పోర్టు సైజ్ ఫొటో, వికలాంగులతో పాటు పలు రిజర్వేషన్లు ఉన్నట్లయితే వాటికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు. శాశ్వత మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ
దరఖాస్తు విధానం
ఐటీఐలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్త నోటిఫికేషన్ అయినందున విద్యార్థి, విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు ముందుగా వెబ్ సైట్ https://iti.telangana.gov.in ను సంప్రదించాల్సి ఉంటుంది. అందులోకి వెళ్లి మన వివరాలు నమోదు చేసుకుని మనకు కావాల్సిన ట్రేడ్ లతో పాటు కళాశాలలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. తదనంతరం ప్రభుత్వం నిర్దేశించిన నోటిఫికేషన్ ప్రకారం విద్యార్థు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ సమయంలో మనం ఎంచుకున్న కళాశాలల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అడ్మిషన్లు పూర్తిగా ఆన్ లైన్ కావున సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం విద్యార్థులకు కళాశాలతో పాటు వారి ట్రేడ్లు ఆన్ లైన్ లోనే విద్యార్థులకు మొబైల్ ద్వారా పూర్తి సమాచారం వస్తుంది. కావున విద్యార్థులు గమనించి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ జుమ్లా నాయక్ కోరారు.