ప్రోత్సాహకాల పేరుతో విధులకు డుమ్మా..
సూపరింటెండెంట్ కు సహకరించిన వరంగల్ ఐటీఐ ప్రిన్సిపల్
నిత్యం ఇలాగే జరుగుతున్నా పట్టించుకోని ఉన్నతాధికారులు
తమకేమీ పట్టన్నట్లు వ్యవహరిస్తున్న కూత వేటు దూరంలో ఉన్న ఆర్డీడీ కార్యాలయం
తెలంగాణఅక్షరం-వరంగల్
అది ములుగు రోడ్డులోని ప్రభుత్వం వరంగల్ ఐటీఐ కళాశాల. గతంలో విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ, వక్తిత్వ వికాసం, వృత్తి శిక్షణ ఇస్తూ వారికి మెరుగైన భవిష్యత్ కు నిలయంగా ఉండే ఐటీఐ కళాశాల. ఒకప్పుడు ఆ కళాశాలలో సీటు దొరకాలంటనే అదృష్టంగా భావించే పరిస్థతి. కానీ నేడు అది అక్రమాలకు అడ్డాగా మారి క్రమశిక్షణలోపంతో కొట్టుమిట్టాడుతోంది. ఆ కళాశాల సూపరింటెండెంట్ రోజూ విధులకు డుమ్మా కొట్టినా.. ఈ విషయం ప్రిన్సిపల్ కు తెలిసినా తాను ఏమీ పట్టించుకోకపోవడమే కాక ఆమెకు మద్దతు తెలుపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాక ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో కూడా తనకు తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఉద్యమంలో తనకు అవార్డు ఇస్తున్నట్లు ప్రిన్సిపల్కు చెప్పి మరీ అనుమతి తీసుకుని వెళ్లినా ఆ ప్రిన్సిపల్ పర్మిషన్ మంజూరు చేసి ఆయన సైతం కోడ్ ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. నిత్యం ఇలా విధులకు డుమ్మా కొడుతున్నా కూతవేటు దూరంలో ఉన్న ఆర్డీడీ కార్యాలయం అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి.
వరంగల్ ములుగు రోడ్డులోని ప్రభుత్వ వరంగల్ ఐటీఐ కళాశాలలో సిబ్బంది రోజూ సరైన సమయంలో విధులకు హాజరు కాకపోవడంతో పాటు సూపరింటెండెంట్ రోజు విధులకు డుమ్మా కోట్టడం జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే తప్ప లీవ్ లెటర్లు తీసుకోవడం లేదని పలువురు మండిపడుతున్నారు. ఇదే విషయంపై ఇటీవల ఒకరోజు సదరు సూపరింటెండెంట్ విధులకు డుమ్మా కొట్టి మధ్యాహ్నం వరకు కళాశాలకు రాకపోవడంతో ప్రిన్సిపల్ కు నేరుగా ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. అంతేకాక ఆ పిర్యాదు అందిన తర్వాత ఆరోజుకు సంబంధించి లీవ్ లెటర్ తీసుకున్నట్లు ప్రిన్సిపల్ సైతం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాక సోమవారం సైతం విధులకు డుమ్మా కొట్టిన సమయంలో ఈ విషయంపై వరంగల్ ఆర్డీడీ గారి పర్యవేక్షణలో సైతం ప్రిన్సిపల్ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఓ ప్రజాప్రతినిధి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారికి ప్రశంసాప్రతాలు అందిస్తున్నారని, తాను వెళ్లాలని ప్రిన్సిపల్ ను కోరగా అనుమతి సైతం ఇచ్చినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సూపరింటెండెంట్ పై కళాశాలలోని హాజరుపట్టికలు, బయో మెట్రిక్ హాజరు, సీసీ ఫుటేజీలను పరిశీలించి సూపరింటెండెంట్ తో పాటు ప్రిన్సిపల్ పై చ ర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ను పలువురు కోరుతున్నారు.