తెలంగాణఅక్షరం-వీణవంక
మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కట్ట ఈశ్వరమ్మకు చెందిన గేదె పిడుగుపాటుకు గురువారం సాయంత్రం మృతి చెందింది. బాధితురాలు కథనం ప్రకారం.. బాధితురాలు ఇటీవల గేదెను సుమారు రూ.50 వేలతో కొనుగోలు చేసింది. కాగా గురువారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈదురు గాలులతో పాటు ఇంటి సమీపంలో చెట్టుకు కట్టేసిన గేదేపై పిడుగు పడింది దీంతో గేదె అక్కడికక్కడే మృతి చెందింది. మృతితో బాధిత కుటుంబం రోదనలు మిన్నంటాయి.
Please follow and like us: