తెలంగాణ అక్షరం-వీణవంక
వీణవంక మండల కేంద్రంలో
రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలు
అంగరంగ వైభవంగా నిర్వహించారు.వీణవంక మండల కేంద్రంలో దళిత కులస్తులు, పోచమ్మ బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు . ప్రతి వీధి నుండి బోనాలు ఎత్తుకొని, కోలాట నృత్యాలతో బస్టాండ్ కూడలి నుండి ఎల్లమ్మ తల్లి గుడి వరకు ర్యాలీగా వెళ్లారు. రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలను సమర్పించి గ్రామము సుభిక్షంగా పాడిపంటలతో ఆయురారోగ్యాలతో ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకున్నారు .ఈ కార్యక్రమంలో కుల పెద్దలు, పులాల మొండయ్య, దాసరాపు రాజయ్య, దాసరపు బత్కయ్య, దాసరపు సమ్మయ్య, దాసరపు రాజయ్య అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Please follow and like us: