హనుమకొండ బీఆర్‌ఎస్ కార్యాలయానికి అనుమతి లేదంటూ మునిసిపల్ అధికారుల నోటీసులు
తెలంగాణ అక్షరం-హనుమకొండ
హనుమకొండ బీఆర్‌ఎస్ భవనంకు అనుమతి లేదంటూ గ్రేటర్ కార్పొరేషన్ అధికారులు బీఆర్‌ఎస్ హనుమకొండ అధ్యక్షుడికి నోటీసులను జారీ చేశారు. హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు బీఆర్‌ఎస్ కార్యాలయంకు నోటీసులు ఇచ్చారు. కాజీపేట సర్కిల్ కార్యాలయం నుంచి ఈ/285476/జీడబ్ల్యూఎంసీ/ఏసీపీ-3/వార్డు నెంబరు 30/2024 లేఖను 25 జూన్ న అందించారు. ఈ లేఖ అందిన మూడు రోజుల్లో తీసుకున్న అనుమతి పత్రాలను సమర్పించాలని నోటీసుల్లో కొరారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ కార్యాలయాలను టీడీపీ ప్రభుత్వం కూల్చివేతలు ప్రారంభించిన తరహాలో తెలంగాణలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌పై దాడికి దిగబోతున్నది. ఇప్పటికే నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ భవనం కూల్చివేయాలంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా హనుమకొండ భవనంపై కూడా స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఫిర్యాదు చేయడంతో అధికారులు కదిలారు.