పార్టీలకతీతంగా సమస్యల పరిష్కారం..
రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ
- మంత్రి పొన్నం ప్రభాకర్
జడ్పీ చైర్ పర్సన్, జడ్పిటిసి, ఎంపీపీలకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం.
తెలంగాణ అక్షరం- కరీంనగర్
పార్టీలకతీతంగా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పదవీ బాధ్యతలు పూర్తి చేసుకున్న జడ్పీ చైర్ పర్సన్, జెడ్పిటిసిలు, ఎంపీపీలు, జడ్పి కోఆప్షన్ మెంబర్లకు కరీంనగర్ లోని జడ్పీ కార్యాలయంలో మంగళవారం ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఐదు సంవత్సరాల ప్రజా జీవితంలో నిధులు ఉన్నా లేకున్నా అనేక కష్టాలు వచ్చినా, ప్రజా సమస్యలు పరిష్కరించి ఎంపీపీలు జడ్పిటిసిలు మంచి పేరు సంపాదించారని పేర్కొన్నారు. ఎంపీపీలు, జడ్పిటిసిల పదవీకాలం ముగిసినా ప్రజా జీవితంలో మీరు మళ్ళీ ఏదో పదవిలో ఎన్నికై ప్రజలకు సేవలు అందిస్తారని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. రాజకీయ కతీతంగా సహృద్భావ వాతావరణంలో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. మీరంతా భవిష్యత్తులో మరిన్ని పదవులు సాధించే అవకాశం ఉందని చెప్పారు. కొన్ని సమస్యలు పరిష్కారం కానీ ఉన్నా వాటిని మళ్లీ పరిష్కరించే దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు. కరీంనగర్ జడ్పీ చైర్మన్ గా తన రాజకీయ గురువు జువ్వాడి చొక్కా రావు పని చేశారని, తర్వాత అనేకమంది పనిచేశారని తెలిపారు. పదవీ బాధ్యతలు పూర్తి చేసుకున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో స్థానిక సంస్థలకు మరింత ప్రాధాన్యం కల్పిస్తామని పేర్కొన్నారు. జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ మాట్లాడుతూ స్థానిక సంస్థలను ప్రభుత్వం మరింత బలోపేతం చేయాలని కోరారు. తన భర్త ప్రోత్సాహంతోనే రాజకీయాల్లో ఇంత దూరం వచ్చానని పేర్కొన్నారు. ఐదేళ్ల పదవీకాలంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశామని చెప్పారు. జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ గణపతి, వైస్ చైర్మన్ పేరాల గోపాల్ రావు, జడ్పిటిసిలు ఎంపీపీలు జడ్పి కోఆప్షన్ సభ్యులను మంత్రి ఘనంగా సన్మానించారు. అంతకు ముందుకు జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జడ్పి సీఈవో శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.