జమ్మికుంట రూరల్ సీఐ కోరె కిషోర్ హెచ్చరిక
చెడు వ్యసనాలకు పాల్పడే వారిపై పోలీసుల నిఘా
బేతిగల్ గ్రామంలో అవగాహన సదస్సు
తెలంగాణ అక్షరం-వీణవంక
గంజాయి వినియోగించిన అక్రమ రవాణా చేసిన కఠిన చర్యలు ఉంటాయని జమ్మికుంట రూరల్ సీఐ కోరె కిషోర్ హెచ్చరించారు. మండలంలోని బేతిగల్ గ్రామము లో ఎస్సై తోట తిరుపతి ఆధ్వర్యంలో బుధవారం గంజాయి పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జమ్మికుంట రూరల్ సిఐ కోరే కిషోర్ బస్టాండు కూడలి వద్ద విద్యార్థులు, యువకులు, గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో ఎక్కువగా గంజాయి తీసుకునేవారు 18 సంవత్సరాల 25 సంవత్సరాల యువకులు ఎక్కువగా పట్టుబడుతున్నారని తెలిపారు. ఈ గంజాయి కి అలవాటు పడడం వల్ల ఒక మనిషి యొక్క ప్రవర్తన మూడు నెలల్లో అతని ప్రవర్తన మారిపోతుంది. దాని ద్వారా అతని చుట్టు ప్రక్కల ఉండే తోటి మిత్రులు, మరియు గ్రామ ప్రజలతో అసభ్యంగా ప్రవర్తిస్తారని, లేనిపోని విషయంలో తలదూర్చడం ప్రతి విషయంలో గొడవలకు వెళ్లడం లాంటివి చేస్తూ, ఎక్కడ కూడా ప్రతి విషయంలో వీరి ప్రవర్తనమారిపోతూ ఉంటుందన్నారు.ఎక్కువగా వీరు రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు తిరగడం జరుగుతుందని చెప్పారు. ప్రతి గ్రామంలో వీరిపై ప్రత్యేక నిఘా పెడతామన్నారు. అలాగే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి వ్యక్తులు మీకు ఎక్కడైనా అనుమానస్పదంగా కనిపిస్తే మీరు నేరుగా వచ్చి పోలీస్ స్టేషన్లో సంప్రదించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ తోట తిరుపతి, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.