పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

 

 

మండల ప్రత్యేకాధికారి, సీపీఓ డి. కొమురయ్య

 

-చల్లూరులో శుక్రవారం సభను ప్రారంభించిన మండల ప్రత్యేకాధికారి డి. కొమురయ్య

 

తెలంగాణ అక్షరం-వీణవంక

పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని మండల ప్రత్యేకాధికారి, జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ డి. కొమురయ్య అన్నారు. మండలంలోని చల్లూరు గ్రామంలో పీహెచ్సీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు అవగాహన కార్యక్రమం స్థానిక అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం సభ ఏర్పాటు చేయగా మండల ప్రత్యేకాధికారి, సీపీఓ డి కొమురయ్య ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారుల ఎత్తు, బరువులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతీ శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ ద్వారా చిన్నారులకు, గర్భిణీలకు, బాలింతలకు అందజేస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పీహెచ్సీలో ఇచ్చే మెడిసిన్తో పాటు, పౌష్టికాహారాన్ని తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీధర్, ఎంపీఓ ప్రభాకర్, డా కీర్తన, అంగన్వాడీ సూపర్వైజర్ శశికిరణ్మయి, పంచాయితీ కార్యదర్శి సంజీవ్, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, స్థానిక నాయకులు పొదిల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

Check Also

మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత

తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన చల్పూరి రవీంద్ర చారి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. కాగా సమాచారం తెలుసుకున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *