ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలి

 

 

ముందు చూపుతో మాజీ సీఎం కేసీఆర్ హరితహారం చేపట్టారు

హరితహారం కార్యక్రమాన్ని కొనసాగించడం పట్ల హర్షం

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

తెలంగాణ అక్షరం- హుజురాబాద్

హుజురాబాద్ నియోజకవర్గం లోని వీణవంక, కమలాపూర్ జమ్మికుంట, ఇల్లందకుంట, హుజురాబాద్ మండలాల్లో పలు గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమం చేపట్టగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులు ప్రజాప్రతినిధులు తో కలిసి మొక్కలను నాటారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. హరితహార కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించడం చాలా సంతోషకరమైనదని అన్నారు.గత ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ ముందు చూపుతో హరితహారం కార్యక్రమం చేపట్టడం ద్వారా ఎంతో మేలు జరిగిందని గత ప్రభుత్వం హరితహారం కోసం చాలా నిధులు కేటాయించడం జరిగింది.చెట్లను పెంచడం ద్వారా పల్లెల్లో పచ్చదనంతో ఎంతో ఉల్లాసంగా ఉంటుందని, చెట్లు నాటడంతో మనిషి జీవనానికి ఎంతో ఉపయోగపడతాయి. చెట్ల ద్వారా వచ్చే గాలి స్వచ్ఛమైనది ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని అన్నారు. ప్రతి ఒక్కరు చెట్లు నాటాలన్నారు. చల్లూరు గ్రామంలో హరితవనాన్ని ద్వారా 21 వేల మొక్కలను మామిడి జామ తో పాటు అనేక చెట్లను నాటడం జరిగిందని హరితహారం కార్యక్రమం లో గతంలో భాగంగా మోడల్ పార్క్ లాంటి పకృతివనాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అవార్డు తీసుకున్న చల్లూరు ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిని అభినందించారు. వన మహోత్సవం లో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని వారికి సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .

Please follow and like us:

Check Also

మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత

తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన చల్పూరి రవీంద్ర చారి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. కాగా సమాచారం తెలుసుకున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *