విద్యార్థిసంఘాల పేరిట పలువురి వేధింపులు

కాపాడాలని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు అధికారులు వేడుకోలు

కలెక్టర్ తో పాటు సీపీకి వినతి పత్రం అందజేత

తెలంగాణ అక్షరం-హన్మకొండ

స్వచ్ఛందంగా సేవ చేస్తూ విద్యా వ్యవస్థలో ప్రైవేట్ రంగంలో పలువురికి ఉపాధి కల్పిస్తూ విద్యార్థి సంఘాల పేరిట పలువురు తమను కొంతమంది వేధిస్తున్నారని, వారి నుండి తమను కాపాడాలని వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు అధికారులను కలిసి  వేడుకున్నారు. ఈ మేరకు పలువురు విద్యాసంస్థల అధినేతలు కలెక్టర్, సీపీనికలిసి శనివారం వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యం(టీపీజేఎంఏ) సంఘం నాయకులు మాట్లాడుతూ తమను కొంత మంది తాము విద్యార్థి సంఘాల నాయకులమంటూ తమ పాఠశాలలపై (ఆర్టీఏ) సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ తమను వేధిస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తాము విద్యార్థులకు మంచి విద్యను అందిస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని, అంతేకాకుండా రాష్ర్ట, జాతీయ, అంతర్జాతీయ  స్థాయిలో  ఉత్తమ ఫలితాలు సాధిస్తూ విద్యార్థులను ఉన్నతస్థానంలో ఉండే విధంగా చూస్తున్నామని చెప్పారు. కానీ కొంత మంది వేధింపుల వల్లతాము ఇబ్బందులకు గురవుతున్నట్లు వాపోయారు. తాము పలువురికి స్వయం ఉపాధి కల్పిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాధి మందికి ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. కాగా వేధింపులకు గురి చేస్తున్నవారి పేర్లతో కూడిన ఐదుగురిపై లిఖితపూర్వ కంగా ఫిర్యాదు ఫిర్యాదు చేసినట్లు వారు పేర్కొన్నారు. వారి వేధింపులకు గురిచేస్తున్న వారి నుండి కాపాడాలని కోరినట్లు పేర్కొన్నారు.

 

Please follow and like us:

Check Also

మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత

తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన చల్పూరి రవీంద్ర చారి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. కాగా సమాచారం తెలుసుకున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *