ఘరానా మోసం

ప్రభుత్వ వైద్యురాలి చీటింగ్..

సంతకం తేడాతో చెక్కు జారీ..
పోలీసులను ఆశ్రయించిన బాధితుడు..
తెలంగాణ అక్షరం -నర్సంపేట
ఓ ప్రభుత్వ వైద్యురాలు సంతకం తేడాతో ఇచ్చి ఘరానా మోసం చేసిందని ఓ బాధితుడు నర్సంపేట పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనకు సంబంధించి విషయం ఆలస్యంగా తెలిసింది. బాధితుడి కథనం ప్రకారం.. నర్సంపేట పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వ వైద్యురాలు కొద్దిరోజుల క్రితం నరేష్ అనే వ్యక్తి దగ్గర భూమి కొనుగోలు చేసింది. ఈ వ్యవహారంలో రూ. 5లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఆ నగదుకు సంబంధించి చెక్కు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయమని కోరగా సదరు బాధితుడు అంగీకరించాడు. అనుకున్న ఒప్పందం ప్రకారం చెక్కు తీసుకొన్న తదుపరి రిజిస్ట్రేషన్ చేశాడు. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత చెక్కు తీసుకుని బ్యాంకు కు విత్ డ్రా చేసుకోవడానికి వెళ్లగా అక్కడ సంతకం మ్యాచ్ కావడం లేదు అంటూ బ్యాంకు అధికారులు చెప్పారు. ఈ విషయంపై సదరు వైద్యురాలిని నరేష్ సంప్రదించగా నీకు డబ్బులు ఇచ్చేదే లేదంటూ బుకాయించింది. తనకు సంతకం మ్యాచ్ కాకుండా ముందస్తుగానే ఆ వైద్యురాలు మోసం చేయాలని ఉద్దేశంతోటే తనకు చెక్కు ఇచ్చి తనను మోసం చేసిందని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. సదరు వైద్యురాలిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరుతున్నాడు.

 

 

Please follow and like us:

Check Also

మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత

తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన చల్పూరి రవీంద్ర చారి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. కాగా సమాచారం తెలుసుకున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *