తెలంగాణఅక్షరం-శంకరపట్నం
నూతన ఎమ్మార్వోగా బదిలీపై వచ్చిన శంకరపట్నం ఎమ్మార్వో బత్తుల భాస్కర్ ను మాజీ వైస్ ఎంపీపీ పులికోట రమేష్ శుక్రవారం మర్యాదపూర్వం కలిసి సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ రమేష్ మాట్లాడారు. శంకరపట్నం మండల తాసిల్దార్ గా విధులు నిర్వహించిన జోగినపల్లి అనుపమ రావు హుజురాబాద్ ఆర్డిఓ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ గా, రామడుగు తాసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న తహసిల్దార్ బత్తుల భాస్కర్ ను శంకరపట్నం తాసిల్దార్ గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసిల్దార్ భాస్కర్ ను మర్యాదపూర్వ కలిసి శాలువాతో సన్మానం చేసి స్వాగతం పలికినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గద్దపాక ప్రాథమిక వ్యవసాయ సహాయ సహకార సంఘం చైర్మన్ గుర్రాల తిరుపతిరెడ్డి, సంఘ సభ్యులు నల్ల కోమల్ రెడ్డి, కాచాపూర్ మాజీ సర్పంచ్ కొండ్ర రాజయ్య,మాజీ వైస్ ఎంపీపీ కొయ్యడ పరుశరాములు, నాయకులు రాచర్ల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.