ముగ్గురు చిన్నారులకు కాటు
తీవ్రంగా గాయపడిన విద్యార్థులు
తెలంగాణ అక్షరం-వీణవంక
మండలంలోని ఘన్ముక్లలో పిచ్చి కుక్కల స్వైర విహారం చేస్తూ అమాయక ప్రజల వెంటాడుతూ కాటు వేస్తున్నాయి. బుధవారం పాఠశాలకు వెళ్లి వచ్చి ఇంటి వద్ద ఆడుకుంటున్న ఓ ముగ్గురు చిన్నారులను కాటు వేసి తీవ్రంగా గాయపరిచాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఊట్ల రిషి (10), ఓరుగంటి నాగప్రణయ్ (13), స్వప్న(10) అనే చిన్నారులు వారి ఇంటి వద్ద ఆటలాడుకుంటున్న క్రమంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. వారి వెంట పడి కాటు వేసి తీవ్రంగా గాయపరిచాయి. గమనించిన స్థానికులు వాటిని అక్కడి నుండి వెళ్లగొట్టారు.
ఆర్ఎంపీ వైద్యుడి సాయం
కుక్క కాటు బాదితులైన చిన్నారులనున స్థానికంగా కంకణాల ప్రభాకర్ రెడ్డి అనే ఆర్ఎంపీ వైద్యుడు చిన్నారులను చేరదీసి వారికి ప్రథమ చికిత్స చేసి సేవలందించారు. తీవ్రంగా గాయపడిని ఆ చిన్నారుల గాయాలను శుభ్రపరిచారు. ఆ తర్వాత వెంటనే 108కు ఫోన్ చేసి వారిని మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
పట్టించుకోని అధికారులు
గ్రామాల్లో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకున్న పాపానా పోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతున్నా అధికారులు మాత్రం గ్రామాలను సందర్శిస్తూ సమస్యలు పరిష్కరించడం లేదనే విమర్శలు వెత్తుతున్నాయి. వారి నిర్లక్షం కారణంగానే ఇలాంటి దాడులు జ రుగుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి గ్రామాల్లో పర్యటించి గ్రామాల్లోని కుక్కలను గ్రామాల నుండి తరలించాలని ప్రజలు కోరుతున్నారు.