భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి

 

* త‌క్ష‌ణ స‌హాయ చ‌ర్య‌లు చేప‌ట్టండి

* సీఎస్, డీజీపీ లను ఆదేశించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ అక్షరం-హైదరాబాద్

తెలంగాణ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు నేప‌థ్యంలో అన్ని ప్ర‌భుత్వ విభాగాల అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారితో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా వ‌ర్షాలు కురుస్తున్నందున రెవెన్యూ, మున్సిప‌ల్‌, విద్యుత్‌, వైద్యారోగ్య శాఖాధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండేలా చూడాల‌ని సీఎస్‌కు ముఖ్య‌మంత్రి సూచించారు. ఎక్క‌డా ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా చూడాల‌ని, లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను త‌క్ష‌ణ‌మే స‌హాయ‌క శిబిరాల‌కు త‌ర‌లించాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. రిజ‌ర్వాయ‌ర్ల గేట్లు ఎత్తుతున్న దిగువ ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని ఆదేశించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేంద‌ర్ అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు, పోలీసు క‌మిష‌న‌ర్లు, కార్పొరేష‌న్‌, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. క్షేత్ర స్థాయి ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టికప్పుడు స‌మీక్షిస్తూ త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారిని ఆదేశించారు.

Please follow and like us:

Check Also

మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత

తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన చల్పూరి రవీంద్ర చారి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. కాగా సమాచారం తెలుసుకున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *