వీణవంక ఎంపీడీవో శ్రీధర్
తెలంగాణ అక్షరం-వీణవంక
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీణవంక ఎంపీడీవో శ్రీధర్ సూచించారు. మండలంలోని వీణవంక నర్సింగాపూర్ గ్రామాల మధ్య గల నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు భారీ వర్షాలకు తెగిపోవడంతో ఆయన సిబ్బందితో కలిసి ఆదివారం పరిశీలించారు. రోడ్డుపై నిత్యం నడిచే వాహనాలకు అంతరాయం కలగడంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసర సమయాల్లో మాత్రమే బయటికి రావాలని సూచించారు. ఎంపీడీవో వెంట ఏపిఓ శ్రీధర్ గట్టు స్వామి, సిబ్బంది తదితరులు ఉన్నారు.
Please follow and like us: