తెలంగాణఅక్షరం-కరీంనగర్
బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ విప్, ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ కు గురువారం పంపించినట్లు తెలిపారు. 2019 లో టిఆర్ఎస్ లో చేరి, గత నాలుగు సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బై-ఎలక్షన్లలో, మున్సిపల్ ఎలక్షన్లలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేశారు. పార్టీ నాయకత్వం పట్ల ఎంతో నమ్మకంతో పనిచేశానని, కాని ప్రత్యేకంగా మానకొండూర్ ఎమ్మెల్యే ప్రవర్తన, పనీతీరు, సరిగా లేని కారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో స్థానికంగా నేను కొనసాగే పరిస్థితి లేనందున పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పారు.