ఆర్టీసీ క్రాస్ రోడ్డు లో మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభం

సందడి చేసిన కీర్తి సురేష్

నాగోల్ తో పాటు కర్నాటకలోనూ త్వరలో ప్రారంభం

తెలంగాణ అక్షరం- హైదరాబాద్

హైదరాబాదు నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో మాంగళ్య షాపింగ్ మాల్ 20వ స్టోర్ ను సినీ నటి కీర్తి సురేష్ ఆదివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి కీర్తి సురేష్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో అధునాతన కలెక్షన్స్ తో అతిపెద్ద షాపింగ్ షాపింగ్ మాల్ గా అవతరించిందనీ ఈ స్టోర్ ను నేను ప్రారంభించడం ఆనందంగా ఉందని, పట్టు ఫ్యాన్సీ కంచి ధర్మవరం ఉప్పాడ పట్టు చీరలతో పాటు, అధునాతన కలెక్షన్స్ తో కీడ్స్, ఎత్నిక్ వెర్ మెన్స్ అండ్ ఉమెన్స్ వివాహాది శుభకార్యములకు ప్రత్యేక వస్త్ర ప్రపంచం మాంగళ్య షాపింగ్ మాల్ అని పేర్కొన్నారు. షాపింగ్ మాల్ డైరెక్టర్లు పి ఎన్ మూర్తి, కాసం నమశ్శివాయ, కాసం మల్లికార్జున్, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్ కుమార్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో గత 12 సంవత్సరాలుగా ప్రజల మన్ననలు పొందుతూ ఇప్పటివరకు 20 స్టోర్ లు ప్రారంభించమని, మరో వారంలో హైదరాబాద్ నగరంలో నార్సింగ్, మణికొండ లో ప్రారంభించబోతున్నామని, త్వరలో కర్ణాటక రాష్ట్రంలోనూ వ్యాపారాన్ని తెలిపారు.  తన వస్త్రాలను ఎల్లప్పుడూ ఆదరిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అధునాతన ఫ్యాషన్ డిజైన్లను అందించడానికి ప్రధాన కారణం తమ సొంత మగ్గాలపై తయారు చేయడంతో వినియోగదారులకు తక్కువ రేటుకే నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తొడపనూరి అరుణ్ కుమార్, కార్తీక్, విశాల్, వరుణ్, ఫణి, సాయి పాల్గొన్నారు. అందాల తార సినీనటి కీర్తి సురేష్ చూసేందుకు ఉదయం నుండి అభిమానులు, పరిసర ప్రాంత యువతి యువకులు బారులు తీరారు. కేరింతలతో షాపింగ్ మాల్ ప్రాంతం అంతా పండగ వాతావరణం కనిపించింది. ముందుగా కీర్తి సురేష్ అభిమానులను చూసి సందడి చేశారు.

Please follow and like us:

Check Also

మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత

తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన చల్పూరి రవీంద్ర చారి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. కాగా సమాచారం తెలుసుకున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *