తెలంగాణ అక్షరం-కరీంనగర్ బ్యూరో సెప్టెంబర్
ఎమ్మెల్సీ పరిధిలో మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి ఉన్నట్లు ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు.విద్యారంగంలో ఉన్నతమైన విద్యాప్రణాలు పెంచేందుకు అపారమైన అనభవంతో ఎమ్మోల్సీ బరిలో దిగుతున్నట్లు మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి స్పష్టం చేశారు.కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు… విద్యారంలో అపారమైన అనుభవం సాధించిన తనకు నాణ్యతగల విద్యనిందించే విగంగా కీలక మార్పులు తీసుకవస్తానన్నారు.చాలా ప్రాంతాల్లోపాఠశాల స్థాయి నుండి ఉన్న విద్యా సంస్థలను స్థాపించి ఎంతో మంది విద్యార్థులను ఉన్నత శిఖరాల ఎదిగేలా మానేరు విద్యాసంస్థలు కృషిని అందించామన్నారు.తనకు ఉపాధ్యాయ రంగాల మద్దతు కూడా ఎంతో ఉందన్నారు.తాను ప్రస్తుతం బీజేపీ నుండి ఎమ్మేల్సీ టికెట్ ఆశిస్తున్నానని వెల్లడించారు. బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కూడా కలిశానని, సానుకూలంగా స్పందించి పూర్తి మద్దతు ఇస్తున్నానని చెప్పారని వెల్లడించారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి పూర్తి మద్దతు నాకే ఇచ్చే విధంగా వారిని కోరుతున్నా అన్నారు. బిజెపి పార్టీ టికెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలబడి భారీ మెజార్టీతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించుతానని స్పష్టం చేశారు.