తెలంగాణ అక్షరం-హసన్ పర్తి
జడ్.పి.హెచ్.ఎస్ గర్ల్స్ హాసన్ పర్తి ఉన్నత పాఠశాలలో జరుగుతున్నటువంటి మండల స్థాయి ప్రైమరీ లెవెల్ కాంప్లెక్స్ మీటింగ్ కి జిల్లా అకాడమిక్ మోనిటరింగ్ మరియు క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి గారు హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు అందరికీ కూడా తగు సూచనలు చేశారు. స్కూల్లో పిల్లల సంఖ్యను పెంచి అదేవిధంగా లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ నైపుణ్యాలను విద్యార్థిని విద్యార్థులకు అభివృద్ధి చేయాలని సూచించారు ,అదేవిధంగా న్యాస్ నేషనల్ అచీవ్మెంట్ సర్వే, మాక్ టెస్ట్ కూడా చక్కగా నిర్వహించి నవంబర్ 19 రోజు జరగబోయే జరగబోయే నాస్ పరీక్షలకు 3వ తరగతి ,6వ తరగతి 9వ తరగతి విద్యార్థులను సంసిద్ధం చేయాలని సూచించారు .ఈ కార్యక్రమంలో హసన్ పర్తి మండల ఎంఈఓ ఈసరి రవీందర్ , కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సంపత్, రవికుమార్, రమాదేవి ,రంగనాథ్ , సిఆర్పిలు ,రాజ్ కుమార్ నాగరాజు, రమేష్, రజని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు